సమ్మక్క-సారలమ్మ గద్దెను తాకిన వరద
అల్లాడుతున్న ములుగు
పొంగిపొర్లుతున్న జంపన్న వాగు
స్పాట్ వాయిస్, ములుగు: పర్యాటక ఖిల్లా ములుగు జిల్లా వర్షాలు, వరదలతో అల్లాడిపోతోంది. జిల్లాలో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జంపన్నవాగు పొంగిపొర్లుతుంది. రెండు వంతెనల పై నుంచి ఉధృతంగా నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న కాల్వపల్లి ,ఉరట్టం, నార్లాపుర్ , బయ్యక్కపేట గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరాయి. సమ్మక్క- సారలమ్మ గద్దేల ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో గద్దెల సమీపంలోని దుకాణాల్లో నీళ్ళు రావడంతో, వ్యాపారస్తులు దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మేడారంలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో మేడారం పరిసర గ్రామల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన జాలర్లు
తాడ్వాయి మండలం మేడారం, నార్లాపూర్ గ్రామాల్లో జంపన్న వాగు వరద క్షణాల్లో పెరగడంతో మేడారంలో ఎనిది మందిని,నార్లపూర్ గ్రామంలో నలుగురిని వరదల నుంచి స్థానిక జాలర్లు కాపాడారు.
రెండు వందల ఇండ్లు నీట మునక
తాడ్వాయి మండలం జంపన్నవాగు వరద ఉధృతికి కొత్తూరు,ఊరట్టం,కాల్వపెళ్లి,రెడ్డిగూడేం,మేడారం ,నార్లాపూర్ గ్రామలలో సుమారు రెండు వందల ఇండ్ల లోకి వరద నీరు ప్రవేశించింది.
*మంగపేట మండలం గౌరారం వాగు బ్రిడ్జి మీదుగా ప్రవహించడం తో శనిగకుంట-బొమ్మాయిగూడేం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం..
*మంగపేట మండలం పోదుమూరు గ్రామస్తులను గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఇండ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
*గౌరారం వాగు ఉప్పెంగడం, గోదావరి నది బ్యాక్ వాటర్ రావడంతో ఒడ్డరి కాలనీ ప్రజలను కమలాపురంలోని పునరావాస కేంద్రాలకు సుమారు ముప్పై కుటుంబాలను తరలించారు.
*పస్రా తాడ్వాయి మద్య గల బ్రిడ్జ్ తెగిపోయింది.
మేడారం దర్శనం బంద్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాన్ని భారీ వర్షాల కారణంగా నిలిపివేసినట్లు ఆలయ ఈవో రాజేందర్,పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Recent Comments