Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్కూలిన చలివాగు బ్రిడ్జి

కూలిన చలివాగు బ్రిడ్జి

టేకుమట్ల-రాఘవరెడ్డి పేట మధ్య నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలతో అల్లాడుతున్న జయశంకర్ జిల్లా
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారీ వర్షాలకు అల్లాడిపోతోంది. వరదలు గ్రామాలకు గ్రామాలను ముంచెత్తుతున్నాయి.ఇళ్లల్లోకి చేరి నిరాశ్రయులను చేస్తున్నాయి. ఇప్పటికే మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకోగా.. గ్రామస్తులను రక్షించేందుకు ప్రభుత్వం ఆర్మీ హెలీకాప్టర్లను ఏర్పాటు చేసింది. ఇక గణపురం గణపసముంద్రం మత్తడి పోస్తోంది. అలాగే టేకుమట్ల రాఘవ రెడ్డి పేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అలాగే మూడో నంబర్ పిల్లర్ సైతం వంగి పోయి ప్రమాదకరంగా మారింది. దీంతో వాగు ఆవతల్లి గ్రామాలైన రాఘవ రెడ్డి పేట, ఆరెపల్లి , వెల్లంపల్లి, గుమ్మడవెల్లి , , బండపల్లి , కుందనపల్లి , ఎంపేడు , దుబ్యాల, మందరోనిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments