Sunday, May 25, 2025
Homeలేటెస్ట్ న్యూస్అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దు

అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దు

అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్

స్పాట్ వాయిస్, క్రైమ్ : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రెండురోజులు భారీ వర్షాలు

రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరెట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.

*ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళవదు.

*చెట్ల కింద,పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.

*ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో చెరువులోకి,నాలాలు , వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.

* ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

*వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.

*వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురై ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.

*వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటొద్దు అని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments