శనివారం స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
సోమవారం పున ప్రారంభం
స్పాట్ వాయిస్, బ్యూరో : భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం శనివారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో రోజు సెలవును పొడగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శనివారం సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు శుక్రవారం రాత్రికి అందాయి. దీంతో శనివారం విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల డీఈవోలు ప్రకటించారు. సోమవారం తిరిగి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
Recent Comments