Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్అధికార పార్టీ నుంచి ఎంపీపీ సస్పెండ్..

అధికార పార్టీ నుంచి ఎంపీపీ సస్పెండ్..

అధికార పార్టీ నుంచి ఎంపీపీ సస్పెండ్

స్పాట్ వాయిస్ నర్సంపేట, (చెన్నారావుపేట) : అధికార బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీని శనివారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చెన్నారావుపేట ఎంపీపీ బాధావత్ విజేందర్ ఆయనతో పాటుమారో నాయకుడు తోగరు చెన్నారెడ్డి లను బీ ఆర్ ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చెన్నారావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి బీ ఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీపీ బాదావత్ విజేందర్, తోగరు చెన్నారెడ్డి లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి బహిష్కరించినట్టు మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ బుర్రు తిరుపతి లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో మండల పార్టీ నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు, కో ఆప్షన్లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంపీపీ పై అవిశ్వాసం తీర్మాణం

అనంతరం ఎంపీపీ విజేందర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మండలం లోని ఎంపీటీసీలు ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments