Wednesday, November 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్మద్యం తాగిన గురుకుల విద్యార్థులు .. 

మద్యం తాగిన గురుకుల విద్యార్థులు .. 

మద్యం తాగిన గురుకుల విద్యార్థులు .. 

టీచర్‌పై నింద.. అధికారుల సందర్శనతో వెలుగులోకి నిజాలు 

మద్యం అమ్మిన షాప్ పై కేసు ..?

స్పాట్ వాయిస్, ములుగు: గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్టల్ లో మద్యం తాగారు. గమనించిన టీచర్ వారిని మందలించడంతో ఎక్కడ దొరికిపోయామని భావించి ఆ ఉపాధ్యాయుడిపైనే నింద మోపారు. చివరకు అధికారుల సందర్శనలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చారు. అయితే వారు మద్యం సేవిస్తున్నప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు చూసి మందలించారు. మరోసారి ఇలాంటి తప్పులు చేయమని వారితో లెటర్ రాయించుకున్నారు. మరుసటి రోజు విద్యార్థులు ఎవ్వరికి చెప్పకుండా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అయితే వ్యాయామ ఉపాధ్యాయుడే మందుకొట్టి మేము తాగినట్లు మాతో లెటర్ రాయించుకున్నారని తల్లిదండ్రులకు వారు అబద్ధం చెప్పారు. విద్యార్థుల మాటలు నమ్మిన తల్లిదండ్రులు ఆ మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగడంతోపాటు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామికి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో వారు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టగా నిజాలు వెలుగు చూశాయి. తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని విచారణలో వెల్లడైంది. శనివారం రాత్రి వైన్ షాప్ లో విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా బయటపడింది. అయితే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్ధులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపాల్‌ అంకయ్య తెలిపారు. 21 ఏళ్లలోపు విద్యార్ధులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లిలోని వైన్ షాప్ పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments