Saturday, April 19, 2025
Homeతెలంగాణహైదరాబాద్ కు వచ్చేయ్..

హైదరాబాద్ కు వచ్చేయ్..

ప్రగతి భవన్ చేరిన కడియం-తాటికొండ పంచాయతీ
ఎమ్మెల్యే రాజయ్యకు అధిష్టానం పిలుపు..
వేటా.. వివరణ.. !
స్టేషన్ పంచాయతీ మరింత ఉత్కంఠ

స్పాట్ వాయిస్, బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ పంచాయతీ ప్రగతి భవన్ చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వీరి లొల్లి అధికార పార్టీ బీఆర్ఎస్ ను రాష్ట్ర వ్యాప్తంగా చులకన అయ్యేలా చేస్తోంది. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదట స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు బీఆర్ఎస్ హైకమాండ్ పిలు వచ్చింది. ప్రగతి భవన్ కు వచ్చి కేటీఆర్ ను కలవాలని ఆదేశించింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై సంజాయిషీ అడిగే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గంలో ఇన్నాళ్లు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలుపై వివరణ కోరనున్నారు. ఈ ఘటనతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయం ఉత్కంఠగా మారింది. అధిష్టానం రాజయ్యపై చర్యలు తీసుకుంటుందా.. లేక వేటు వేస్తుందా.. అని ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే ఎన్నికల వేళా.. అంతర్గత లొల్లిని చల్లార్చి మరోసారి ఎవరూ ఇలా ఆరోపణలు చేసుకోకుండా ఉండేంలా గట్టి చర్యలు తీసుకోవాలని అధిష్టానం యోచిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments