Friday, November 22, 2024
Homeరాజకీయంక్షమాపణ చెప్పు.. ముక్కు నేలకు రాయ్..

క్షమాపణ చెప్పు.. ముక్కు నేలకు రాయ్..

క్షమాపణ చెప్పు..
ముక్కు నేలకు రాయ్..
వారం రోజులు టైం..
స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజకీయ వేడి
తాటికొండ వర్సెస్ కడియం
రాజయ్య వ్యాఖ్యలకు శ్రీహరి కౌంటర్
‘రాజయ్య నువ్వు నా.. కుటుంబం గురించి మాట్లాడావు.. నా..తల్లి గురించి, బిడ్డ గురించి అడ్డగోలుగా మాట్లాడావు.. నేను..కూడా నీలాగా.. నీ..కుటుంబం గురించి మాట్లాడితే నీ..కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకుంటుంది.. అయినా నేను..ఆ..విషయాలు మాట్లాడను.. నన్ను చూసి భయపడితే అర్థం ఉంది.. నా బిడ్డను చూసి కూడా భయపడతావా.. నేను ఏ..ప్రభుత్వ పథకం అమ్ముకొని.. బీపాంలు, నామినేటెడ్ పోస్ట్ లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోలేదు. నూరు తప్పులకు దగ్గరవుతున్నాడు.. శిశుపాలవధకు సమయం సమీపించింది. స్టేషన్ ఘనపూర్ టికెట్ కేసీఆర్ నిర్ణయిస్తారు.. నువ్వు మంచిబంగారం అయితే నాకెందుకు టికెట్ వస్తుంది..తమ్ముడు లాంటివాడివి.. నీ.. మేలుకోరి చెబుతున్న మంచిగా.. పనిచేసుకో.. ప్రజల మెప్పు పొందు.. అంతే తప్పా.. కడియం శ్రీహరి విమర్శించి ప్రజల్లో మరింత పలచనకాకు’.
-ఎమ్మెల్సీ కడియం
స్పాట్ వాయిస్, జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ నియోజకర్గంలో వర్గపోరుతో కుతుకుత ఉడుకుతోంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు రాజయ్య చేసిన ఆరోపణలపై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో స్పందించారు. వారంలో రోజుల్లో తనకు క్షమాపణ చెప్పి.. ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని కడియం శ్రీహరి సవాల్ చేశారు. కొన్ని రోజులుగా తాటికొండ రాజయ్య చేస్తున్న ఘాటు వ్యాఖ్యలపై స్పందించిన కడియం శ్రీహరి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయన్నారు. రాజయ్య తీరుపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశానని.. సంయమనం పాటించాలని సూచించడం వల్లే ఓపిక పడుతున్నానని చెప్పుకొచ్చారు. అయితే.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అసలు ఎస్సీనే కాదని.. దొంగ సర్టిఫికెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశాడని.. అవినీతి తిమింగలమంటూ రాజయ్య చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తన తండ్రి ఎస్సీ అని.. తల్లి బీసీ అని.. తండ్రి కులమే కొడుక్కి వర్తిస్తుంది కాబట్టి.. ఆ ప్రకారంగా తాను ఎస్సీనే అని కడియం వివరించారు. ఈ విషయం కూడా ఎమ్మెల్యే రాజయ్యకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. రాజయ్య తన తల్లి, తండ్రి, కూతురు గురించి మాట్లాడటం తనను ఎంతగానో బాధించాయని కడియం చెప్పుకొచ్చారు. తన కులంపై ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై వారం రోజుల్లో భేషరతుగా క్షమాపణ చెప్పి.. ముక్కు నేలకు రాయలని శ్రీహరి డిమాండ్ చేశారు. ప్రజలు తనను అపార్థం చేసుకుంటారనే ఈ విషయాన్ని మీడియా ముందు వివరించాల్సి వచ్చిందన్నారు. తనపై చేసిన ఆరోపణలు రాజయ్యకు కూడా వర్తిస్తాయన్నారు. మరోవైపు.. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎన్ కౌంటర్లు ఎక్కువగా జరిగాయని రాజయ్య ఆరోపణలు చేయగా.. దానికి కూడా కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. వైఎస్‌ఆర్ హయంలో ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరిగాయని పేర్కొన్న కడియం.. మరి దానికి రాజయ్య బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజయ్య తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని కడియం శ్రీహరి ఛాలెంజ్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments