ములుగు, వరంగల్ జిల్లాలకు కొత్త మెడికల్ కాలేజీలు
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా మెడిసిన్ చదవాలన్న స్థానిక విద్యార్థుల కల కూడా నెరవేరుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఒక్కో జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కల సాకారం అవుతోంది. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేలకు చేరువ కానున్నాయి.
ములుగు, వరంగల్ జిల్లాలకు కొత్త మెడికల్ కాలేజీలు
RELATED ARTICLES
Recent Comments