కాంగ్రెస్ లోకి ప్రొఫెసర్ పాపిరెడ్డి..
25న రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక
తెలంగాణ తొలి ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఏడేళ్లకు పైగా సేవలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి చైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాపిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ఆచార్యుడిగా పనిచేసి, వరంగల్‌లోనే స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌గా కూడా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ 2014 ఆగస్టు 5న ఆయనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమించగా, ఆ పదవిలో ఏడేళ్లకుపైగా పనిచేసిన పాపిరెడ్డి 2021 ఆగస్టులో వైదొలిగారు. ఖమ్మంలో ఈ నెల 25న జరగనున్న రాహుల్‌గాంధీ సభలో లేదా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యలో గురువారం కాంగ్రెస్ పార్టీ హన్మకొండలో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొనడంతో ఆయన చేరిక దాదాపుగా ఖాయమని హస్తం శ్రేణులు చెబుతున్నారు.
Recent Comments