Friday, September 20, 2024
Homeక్రైమ్సైకిలిస్ట్ ను ఢీకొన్న కాలేజీ బస్..

సైకిలిస్ట్ ను ఢీకొన్న కాలేజీ బస్..

సైకిలిస్ట్ ను ఢీకొన్న కాలేజ్ బస్..

నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి పై గ్రామస్తుల నిరసన..

స్పాట్ వాయిస్, గీసుగొండ: సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కాలేజ్ బస్ డీకొట్టగా అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి..వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ వైపు నుంచి వెళ్తున్న బిట్స్ కళాశాల బస్సు గీసుగొండ మండలం మచ్ఛాపూర్ హార్జ్ తండా వద్ద సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి ని డీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులయిన గ్రామస్తులు కళాశాల బస్సులను నిలిపివేశారు. దీంతో గంట పాటు వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారి పై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ రోడ్డుపై తరచూ ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని, పట్టించుకునే వారే లేరని వాపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments