Sunday, November 24, 2024
Homeక్రైమ్రిటైర్డ్ ఎంపీడీఓ మర్డర్‌కు రూ.8 లక్షలు..

రిటైర్డ్ ఎంపీడీఓ మర్డర్‌కు రూ.8 లక్షలు..

హత్య చేసింది సుపారీ గ్యాంగ్
ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
మిస్టరీ ఛేదించిన పోలీసులు
స్పాట్ వాయిస్, క్రైం: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు అధికార పార్టీకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పోలీసులు ఆదివారం హత్య మిస్టరీని ఛేదించారు.  మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్యను కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో శవమై కనిపించాడు. దీంతో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి హత్య చేసిన సుపారీ గ్యాంగ్ కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు కారు, మూడు సెల్ఫోన్లు, 15వేల రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు వీరే..
1) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన గిరబోయిన అంజయ్య, డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్ ను అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం పరారీలో బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు.

వివరాలు వెల్లడించిన సీపీ
రిటైర్డ్ ఎంపీడీఓ రమకృష్ణ హత్య మిస్టరీ వివరాలను సీపీ రంగనాథ్ వెవల్లడించారు. నిందితుల్లో ప్రధాన నిందితుడైన గురబోయిన అంజయ్యకు చెందిన భూములకు సంబంధించి కొద్ది రోజులుగా గోడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వే నం.174 భూములకు సంబంధించి మృతుడు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి మృతుడు నల్లా రామకృష్ణ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే అక్కసుతో అతడిని హత్య చేసేందుకు అంజయ్య సిద్ధపడ్డాడు. ఇందుకోసం అంజయ్య, తిరుపతిలకు గతంలో పరిచయం ఉండంతో రామకృష్ణయ్య అంతమొందిస్తే 8 లక్షలు రూపాయలు ఇస్తానని అంజయ్య మరో నిందితుడు తిరుపతితో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు అంగీకరించిన తిరుపతి అంజయ్య నుంచి రూ. 50వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. రామకృష్ణయ్య హత్య చేసేందుకు నిందితుడు తిరుపతి మరో ముగ్గురు నిందితులు తన దగ్గరి బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు సహాకారాన్ని తీసుకున్నాడు. ఈ హత్యలో భాగంగా ఈ నలుగురు నిందితులు ఈ నెల 15వ తేదీన కారును తీసుకోని సాయంత్రం 5.30 నిమిషాలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న మృతుడు రామకృష్ణయ్యను కారులోకి ఎక్కించుకెళ్లారు. అదేరోజు సాయంత్రం 6.30కు చిన్నరామన్ చర్ల గ్రామ శివారు ప్రాంతంలో నిందితులు మృతుడు రామకృష్ణయ్య కారు చి దింపి టవల్ తో మృతుడి మెడను బిగించి ఊపిరి అడకుండా చేసి రామకృష్ణయ్య హత్య చేశాడు. హత్య అనంతరం నిందితులు రామకృష్ణయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఓబూల్ కేశవాపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో పడవేశారు. నిందితులు అక్కడి నుంచి బచ్చన్నపేటకు చేరుకోని రామకృష్ణయ్య హత్య చేసినట్లుగా ప్రధాన నిందితుడు అంజయ్యకు సమాచారం అందించి కారును అంజయ్య ఇంటి ఎదుట ఉంచి వెళ్లిపోయారు.
గతంలోనూ హత్య..
నిందితుడు గతం అక్టోబర్ లో సుభద్ర అనే మహిళ ను సుపారీ గ్యాంగ్ కు రూ.2.5లక్షలు ఇచ్చి త్య చేయించాడు. హత్య కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాంబాబు, ఎస్సై దేవేందర్, శరతో పాటు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments