Saturday, November 23, 2024
Homeరాజకీయంకేటీఆర్ పేడుమూతి బోడిలింగం..

కేటీఆర్ పేడుమూతి బోడిలింగం..

మీసాలంటే నాలా పెంచాలి..
పేరు ఉచ్చరించేందుకు భయపడే బచ్చా..
మంత్రి కేటీఆర్ పై కొండా మురళి ఫైర్
స్పాట్ వాయిస్, వరంగల్ : బిడ్డా ఖబడ్దార్.. నా పేరు కూడా పలకడానికి భయపడిన నువ్వు కొండా దంపతుల గురించి మాట్లాడుతావా అంటూ కొండా మురళీ ఫైర్ అయ్యారు. వరంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కొండా దంపతులపై పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన వరంగల్ తూర్పులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడారు. ‘ నా పేరు కూడా పలకడానికి భయపడ్డ నువ్వు కొండా దంపతుల గురించి మాట్లాడుతావా.. మీసాలు ఉంటే నాలా మెలేయ్యాలి. నువ్వు ఆడ, మగ తెలియదు. పేడుమూతి బోడిలింగానివి‘ అంటూ ఘాటుగా విమర్శించారు. కొండా దంపతులు బీదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తారని, చావుకైనా వెనుకాడరన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలుపు ఖాయమని. అందుకే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మొద్దని, ఛత్తీస్ ఘఢ్, కర్ణాటక లెక్కన తెలంగాణలో కూడా ఐదు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

పారిపోయేటోళ్లం కాదు..
కొండా దంపతులు పారిపోయే వారు కాదని, మీ అయ్యే వరంగల్‌లో బస్వరాజ్ సారయ్యను ఓడించాలంటే మీరైతేనే ఓడించగలరని మమ్మల్ని పోటీకి దించారని గుర్తు చేశారు. కొండా మురళి గూండా అని ఈ రోజు అంటాన్నవ్ , ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు పేదల పక్షాన ఎదురు నిలబడి పోరాటం చేసినందుకు గూండాగా పేరు పెట్టారన్నారు. మమ్మల్ని నువ్వు పిలిచినవా.. మేము నీ దగ్గరికి వచ్చామా.. అప్పుడు గుర్తుకు రాలేదా గూండా అని నిలదీశారు. నాకు ఆత్మ అభిమానం ఎక్కువ కాబట్టే తరాజు జోకేటోడు (ఎర్రబెల్లి దయాకర్ రావు) పార్టీలోకి వస్తే తాము బయటికి వచ్చామని తెలిపారు. చదువురాని దయాకర్ రావును మంత్రిని చేసి మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని కొండా మురళి దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నమ్మకద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎవరైతే అక్రమాలు చేశారో వారిని అణా పైసతో కక్కించి బీదలకు పంచిపెట్టే బాధ్యత నాది అని కొండా చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ల అధ్యక్షులు, కొండా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments