Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుభగీరథ నీటితో ఆరోగ్యం ఉత్తమం

భగీరథ నీటితో ఆరోగ్యం ఉత్తమం

భగీరథ నీటితో ఆరోగ్యం ఉత్తమం
ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
స్పాట్ వాయిస్, శాయంపేట : భగీరథ నీటిలో సరైన పోషకాలు ఉంటాయని, భగీరథ నీటిని తాగిన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మిషన్ భగీరథ నీటిని తాగి ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ డీఈఈ చంద్రు నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లోని బోర్ వాటర్ లో టీడీఎస్ 488 ఉంటుందని, అదేవిధంగా ఫిల్టర్ వాటర్ లో 32 ఉంటుందన్నారు. ఫిల్టర్ వాటర్ లో టీడీఎస్ తక్కువగా, గ్రామంలో బోర్ వాటర్ లో ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్ ని తాగేవారు అనారోగ్యానికి గురవుతారన్నారు. అయితే మిషన్ భగీరథ వాటర్ లో టీడీఎస్ 180 ఉండడంతో ఈ భగీరథ వాటర్ తాగేవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, సర్పంచ్ కందగట్ల రవి, ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, పంచాయతీ కార్యదర్శి రత్నాకర్, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments