కమలాపూర్ లో మంచినీళ్ల పండుగ
స్పాట్ వాయిస్, కమలాపూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ డీఈ శ్వేత ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంజేపీ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు రేవతి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసి మిషన్ భగీరథ పథకం ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. పాఠశాలలకు కూడా మిషన్ భగీరథ నీరు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి, సర్పంచ్ కట్కూరి విజయ, అధికారులు, అంగన్ వాడీ టీచర్లు, మహిళా మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్ లో మంచినీళ్ల పండుగ
RELATED ARTICLES
Recent Comments