స్పాట్ వాయిస్, హన్మకొండ: తన భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో అభివృద్ధి పనుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట చంద్రయ్య(46) భార్య రేణుకుంట భాగ్య 2014-19 కాలంలో సర్పంచ్ గా పని చేశారు. ఆమె హయాంలో గ్రామ పంచాయతీకి నిధులు లేకపోవడంతో గ్రామాభివృద్ధి కోసం అప్పులు తెచ్చారు. సుమారు రూ.18 లక్షల వరకు అప్పు చేశారు. వీరి కాలంలో చేసిన పనులకు నేటికీ బిల్లుల రాకపోవడం, వడ్డీలు మీదపడతుండడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన మాజీ సర్పంచ్ భాగ్య భార్త చంద్రయ్య గురువారం రాత్రి తన వ్యవసాయ భూమి వద్దఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రయ్యకి ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సె మహేందర్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Recent Comments