ఒక దొంగతో ప్రేమ పెండ్లి..
మరో దొంగతో సహజీవనం..
ఇంకో దొంగతో రిలేషన్ షిప్..
మరో దొంగతో పరిచయం..
చివరలో నకిలీ పోలీసు..
స్పాట్ వాయిస్, డెస్క్ : ఓ లేడీ.. దొంగను ప్రేమ పెండ్లి చేసుకుని ఇద్దరు పిల్లలనూ కన్నది. అతడిని వదిలేసి మరో దొంగతో సహజీవనం చేసింది. కొద్ది రోజులకు అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్ షిప్‌లో ఉంటూ విలాసాల మోజులో పడింది. ఇక నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసే రోహిత్‌శర్మ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య గొడవలు జరగడంతో అతడిని వదిలేసిన అశ్విని రోహిత్ సింగ్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. అతడిని కూడా వదిలేసి బైక్ లు చోరీ చేసే అభిషేక్‌తో కలిసి ఉంటోంది. అయితే అభిషేక్ కొద్దిరోజుల క్రితం అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. దీంతో తన విలాసాలకు డబ్బు కావాలని ఆలోచించి, పోలీస్ అవతారం ఎత్తింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నానంటూ చెప్పుకుంది. ఈ క్రమంలోనే లంగర్‌హౌస్‌లో నివాసం ఉండే రాకేశ్ నాయక్‌తో పరిచయమైంది. అతడికి నాంపల్లి కోర్టులో సీనియర్ అడ్వకేట్ వద్ద అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని, నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని నమ్మించి, రూ.30 వేలు వసూలు చేసింది. తర్వాత కనిపించకుండా పోవడంతో రాకేశ్‌కు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అశ్వినిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణకు లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.
Recent Comments