Thursday, January 23, 2025
Homeలేటెస్ట్ న్యూస్భారీగా ఇన్ స్పెక్టర్ల బదిలీలు..

భారీగా ఇన్ స్పెక్టర్ల బదిలీలు..

స్పాట్ వాయిస్, క్రైం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో భారీగా పోలీస్ ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. విదేశీ టూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకొని విధుల్లో చేరిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న వినయ్ కుమార్ ను భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు, పాల్వంచలో పని చేస్తున్న నాగరాజును ఐజీ కార్యాలయానికి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సీసీఆర్బీలో పని చేస్తున్న రమేష్ ను భద్రాది కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం టూ టౌన్ ఇన్ స్పెక్టర్ గా నియమించారు. కొత్తగూడెం టూ టౌన్ లో ఉన్న రాజును మహబూబాద్ జిల్లా మరిపెడకు, మరిపెడలో ఉన్న సాగర్ ను ఐజీ కార్యాలయానికి, మహబూబాబాద్ డీసీఆర్బీ లో ఉన్న ఫణిందర్ ను గూడూరుకు, గూడూరులో పనిచేస్తున్న షేక్ యాసిన్ ను ఐజీ కార్యాలయానికి పంపారు. కొత్త గూడెం డీసీఆర్ లో పనిచేస్తున్న ఉపేందర్ రావును మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు, డోర్నకల్ లో పనిచేస్తున్న వెంకటరత్నంను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. మహబూబాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ జూలూరుపాడుకు, జూలూరుపాడు లో పనిచేస్తున్న వసంత్ ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న కరుణాకర్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు, భీమేష్ ను సీసీఎస్ మహబూబాబాద్ కు, ఆసిఫాబాద్ లో ఉన్న పవన్ కుమార్ ను మహబూబాబాద్ డీసీఆర్బీకి బదిలీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments