వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం..
స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ ఫోర్ట్ రోడ్డు పై శివనగర్ సాయిబాబా కమాన్ సమీపంలో ఉదయాన్నే ఆటో దిగి రోడ్డు దాటుతున్న భార్య భర్తలను క్రెన్ ఢీ కొనటంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments