ములుగు జడ్పీ చైర్మన్ మృతి..
స్పాట్ వాయిస్, ములుగు: భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హన్మకొండలోని అజారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ తుది శ్వాస విడిచారు. కాగా, కుసుమ జగదీష్ అకాల మరణంపట్ల బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Recent Comments