రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
మరిపెడలో ఘటన.. చల్లగరిగెలో విషాదం..
స్పా్ట్ వాయిస్, మరిపెడ : మరిపెడ మండలం తానంచెర్ల వద్ద 365 జాతీయ రహదారిపై లారీ బైక్ ను డీకొట్టిన ఘటనలో నవ దంపతులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె కు చెందిన నారాయణ (27), మరిపెడ బంగ్లాకు చెందిన అంజలి (25) కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. నారాయణ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటూ జీవనం గడుపుతున్నారు. శుక్రవారం దంపతులిద్దరు హైదరాబాద్ నుంచి మరిపెడకు బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచెర్ల వద్ద 365 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తు్న్న ద్వి చక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలు అక్కడికికక్కడే మృతి చెందారు. విషయ తెలుసుకున్న మరిపెడ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిపెడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై దూలం పవనకుమార్ తెలిపారు.
మూడునెలలకే ముగిసిన దాంపత్య జీవితం
RELATED ARTICLES
Recent Comments