రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
కాంగ్రెస్ నాయకుడు వేముల సాంబయ్య గౌడ్
స్పాట్ వాయిస్, నర్సంపేట : ఒడిశా రైలు ప్రమాద ఘటనకు రైల్వే శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నర్సంపేట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మృతి చెందిన వారి ఆత్మ శాంతించాలని శ్రద్ధాంజలి ఘటించారు. : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు. రైల్వే శాఖ మంత్రి ఏర్పాటు చేసిన భారత్ కవచ్ (ట్రైన్ డిఫెన్స్ సిస్టం) ఏమైందని ఆయన ప్రశ్నించారు రైల్వే శాఖ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం వల్ల దాదాపు 300 మంది అమాయక ప్రజలు మృతి చెందారని, వెయ్యికి పైగా గాయాలపాలయ్యారని వాపోయారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, స్వల్ప గాయాలైన వారికి రూ. 2 లక్షల చొప్పున వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
RELATED ARTICLES
Recent Comments