ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు పడుతాయని చెప్పింది. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం పెద్దపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు, వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.
మరో మూడు రోజులు వర్షాలు..
RELATED ARTICLES
Recent Comments