కొత్తగా కాదు… చెత్తగా
స్పాట్ వాయిస్, డెస్క్: పబ్ అంటే డీజే సౌండ్స్.. మాస్ డాన్స్… మస్త్ మజా.. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇది రోటీన్ అనుకున్నారో ఏమో.. కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఓ పబ్ నిర్వాహకులు.. కొత్తగా.. కాదుకాదు.. చెత్తగా ఆలోచన చేశారు. పాములు, తొండలు, పిల్లులు, కుక్కలను పబ్ లో పెట్టింది. వాటితో ఆడుకోవచ్చు.. ఒంటిపై తిప్పుకోవచ్చు అంటోంది. మనుషులతో పాటు జంతువుల మధ్య కూడా మందు పార్టీ ఎంజాయ్ చేయమంటోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కస్టమర్ల కోసమటా..
కస్టమర్లను ఆకర్షించేందుకు జూబ్లీహిల్స్‌లోని గ్సోరా పబ్‌లో నిర్వాహకులు ఏకంగా జంతు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అయితే ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెలరోజుల క్రితం సైబరాబాద్‌లోనూ ఇదే రీతిలో పబ్‌లో నిర్వాహకులు జంతువులను ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు ఏకంగా జంతువులను ప్రదర్శనకు పెడుతుండటంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు. ఇటువంటి చర్యలు సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశారు. డీజీపీ, సీపీ హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్తా అంటూ అరవింద్ కుమార్ ట్విట్ చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు.
Recent Comments