Friday, November 22, 2024
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం

ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి

మృత్యువులోనూ వీడని సోదర బంధం

ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్టువేర్..

ఘటన స్థలంలో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు

స్పాట్ వాయిస్, క్రైమ్: హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్న దమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఒకరు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా రెండో వాడు హరికృష్ణ (23) సాప్ట్ వేర్. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. మృత్యువుకు వీడని అన్నదమ్ముల బంధాన్ని చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విషయం తెలిసుకున్న ఎల్కతుర్తి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్ పర్తి ఎస్సై ధేశిని విజయ్ కుమార్ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.

హోటల్ నడుపుకుంటూ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ కందుగులలో హోటల్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండవ వాడు హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ ప్రయోజకులుగా ఎదగడంతో గ్రామంలో ఆ కుటుంబానికి మoచి పేరుంది. ఇక త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. సోమవారం శివరాం, హరికృష్ణలు హైదరాబాద్ లో కొలువులో చేరడానికి కందుగుల నుంచి తెల్లవారు జామున 5 గంటలకు తమ ద్విచక్రవాహనం పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్ క్రాసు రోడ్డు వద్ద మరోవాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుల తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments