మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
భూపాలపల్లిలో విషాదo
స్పాట్ వాయిస్,గణపురం:ఇOటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని మనస్తపానికి గురైన విద్యార్థి ఆత్యహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. గణపురం మండలo బస్వరాజ్ పల్లి గ్రామానికి చెందిన అంబటి రాకేశ్ (19) హన్మకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చేసరికి ఉరి వేసుకొని చని పోయాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments