Tuesday, November 26, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ యూత్ డిక్లరేషన్..

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్..

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్..
ఎన్ని వరాలో..
ప్రతీ నెల 25వేలు, నిరుద్యోగభృతి..
ఇంకా ఎన్నెన్నో..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ సంఘర్షణ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, వచ్చిన వెంటనే యువత కోసం పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అమలు చేయబోయే పథకాలను డిక్లరేషన్ రూపంలో ప్రకటించారు.

* తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీయువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ప్రతినెలా రూ. 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత
* ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేత.. జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత
* మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
* మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
* ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి
*నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు
* ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ
* కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం
* ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన
* విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్​ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన
*ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్​ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు, పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు
*పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు
* బాసరలోని రాజీవ్ గాంధీ ఐఐఐటీ తరహాలో 4 కొత్త ఐఐఐటీ లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం
* అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం
* పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యే వరకు నాణ్యమైన విద్యను అందించడం
*18 ఏళ్లు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత

RELATED ARTICLES

Most Popular

Recent Comments