జూనియర్ పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించిన సర్కార్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులతో చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ కలిసి సమ్మె విషయాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో నోటీసులు రావడంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహామూత్తారం మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె సోమవారం 11 రోజుకు చేరింది. ఈ సందర్భంగా బతుకమ్మను ఆడుతు నిరసన తెలిపారు. వీరికి మహాముత్తారం ఎంపీపీ, పలు గ్రామాల మహిళ సర్పంచులు పాల్గొని మద్దతు తెలిపారు..
సమ్మె ఆపండి.. లేదంటే తీసేస్తాం..
RELATED ARTICLES
Recent Comments