గుర్తు తెలియని మృతదేహం లభ్యం
స్పాట్ వాయిస్ దామెర:మండలం లోని ఒగ్లాపూర్ గ్రామ శివారులో గల ఎస్ బి ఐ టి కాలేజి ముందు జాతీయ రహదారి 163 పై గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైందని ఎస్సై రాజేందర్ తెలిపారు.ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ శివారులో గల ఎస్ బి ఐ టి కాలేజీ ముందు గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో పడి చనిపోయి ఉన్నాడనే సమాచారం వచ్చింది. ఈ మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ముఖానికి, తలకు గాయాలు అయి చనిపోయి ఉన్నాడని చెప్పారు. అతని వయస్సు సుమారు 55- 60 సంవత్సరాలు ఉండి, చామన చాయ రంగులో బక్కగా, నలుపు, తెలుపు రంగు జుట్టు తో, తెలుపు రంగు పలుచటి గడ్డంతో చాతి పై పుట్టు మచ్చ, బూడిద రంగు ఫుల్ షర్టు, నీలరంగు గడులు కల గోదుమ రంగు లుంగీ ధరించి ఉన్నాడన్నారు. వెంటనే మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీ కి తరలించి గ్రామ వీ ఆర్ ఏ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ నంబరు 8712685020 నంబరు లో సంప్రదించగలరని ఎస్సై రాజేందర్ తెలిపారు.
Recent Comments