Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుదొరికిన సెల్ ఫోన్ అప్పగింత

దొరికిన సెల్ ఫోన్ అప్పగింత

ఆటో డ్రైవర్ ను అభినందించిన పోలీసులు
స్పాట్ వాయిస్, నర్సంపేట : ఆటోలో దొరికిన సెల్ ఫోన్ ను డ్రైవర్ పోగొట్టుకున్న వారికి అందజేసి నిజాయతీ చాటుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం…. ఖానాపూర్ కి చెందిన కొత్తపల్లి శిల్ప తన పిల్లలతో కలిసి నర్సంపేటకు ఆటోలో వచ్చింది. ఈ క్రమంలో ఆమె మొబైల్ ఫోన్ ఆటోలో పడిపోగా గమనించకుండానే ఆటో దిగి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత ఆటోలో మొబైల్ ఫోన్ ను గమనించిన డ్రైవర్ నరేష్ విషయం నర్సంపేట పోలీసులకు తెలిపి మొబైల్ ను స్టేషన్ లో అందజేశాడు. బాధితురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు బాధితురాలికి నరేష్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్ ను అందజేశారు. కాగా, నిజాయతీని చాటుకున్న ఆటో డ్రైవర్ ను సీఐ పులి రమేష్ గౌడ్, ఎస్సై రవీందర్ తదితరులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments