Sunday, April 6, 2025
Homeక్రైమ్మావో సిద్ధాంతాలు నచ్చలేదు..

మావో సిద్ధాంతాలు నచ్చలేదు..

మావోయిస్టు దంపతుల లొంగుబాటు…

స్పాట్ వాయిస్, క్రైమ్: మావోయిస్టు దంపతులు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేర‌కు కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, అలియాస్ మున్నా, అలియాస్ సూర్యా, అత‌డి భార్య మడివి సోమిడి అలియాస్ కల్పనను మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కాసరనేని రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్,మణుగూరు ఎల్.ఓ.ఎస్ కమాండర్‌గా ఉన్నాడు. అత‌డి భార్య మడివి సోమిడి చర్ల మండలo వీరిది. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్‌గా, మణుగూరు ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా కొన‌సాగుతున్నారు. కాగా విప్ల‌వ సిద్ధాంతాలు న‌చ్చ‌కపోవ‌డంతోపాటు అనారోగ్యం కార‌ణంగా లొంగిపోయిన‌ట్లు సీపీ వెల్ల‌డించారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments