మరో రెండు రోజులు వర్షాలు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్లతో వర్షం కురిసే అవకాశం ఉంది పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద, ఎత్తయిన ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు.
వదలని వాన..
RELATED ARTICLES
Recent Comments