అంతా తాయత్తు మహిమ..
ఇఫ్తార్ విందులో డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, ఖమ్మం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో సోమవారం రాత్రి ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందు లో డీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నాని.. వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కాడు. గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recent Comments