Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్తీన్మార్ మల్లన్నకు బెయిల్

తీన్మార్ మల్లన్నకు బెయిల్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురికి బెయిల్ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.20వేలు పూచికత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెకండ్ కేసు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న న్యాయవాది.. అదే రోజు ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియచేశారు. ఈ క్రమంలో తీర్పును ఏప్రిల్ 17కు వాయిదా వేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 11న తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా.. నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తీన్మార్‌ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments