భారీగా తరలివచ్చిన ఉద్యోగులు..
మహిళల నుంచి అనూహ్య స్పందన..
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు..
మద్దతు తెలిపిన అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు
స్పాట్ వాయిస్, ఖమ్మం : పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం, “పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్” పేరుతో ఖమ్మం జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు చేపట్టిన ర్యాలీ విజయవంతంగా సాగింది. ఆదివారం సాయంత్రం పెవిలియన్ గ్రౌండ్ నుంచి వందలాదిమంది సీపీఎస్ ఉద్యోగులతో ఆరంభమైన ఈ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో ముగిసింది. 2004 నుంచి అమల్లోకి వచ్చిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ర్యాలీలో పాల్గొన్న సీపీఎస్ ఉద్యోగులు ముక్తకంఠంతో నినదించారు. భవిష్యత్తు పట్ల భరోసా కోసం, తమ పిల్లలు తమ కుటుంబాల రక్షణ కోసం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. సీపీఎస్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొని తమ ఆకాంక్షను ప్రభుత్వానికి సుస్పష్టంగా వివరించారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడం తప్ప మరో మార్గం లేదని పునరుద్గాటించారు. ఉద్యోగుల పాలిట ఆశని పాతంగా మారిన పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఎగ్జిట్ పాలసీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం బాధాకరమన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల కనీస హక్కు అయిన పెన్షన్ పునరుద్ధరణ కోసం పాటుపడాల్సిన బాధ్యత ఉందని సీపీఎస్ నేతలు పునరుద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని సునిశితంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరలో ఒక మంచి నిర్ణయం ఉద్యోగులకు తెలియజేస్తారని ఆశాభావంతో ఉన్నట్లు వారు స్పష్టం చేశారు. ఖమ్మంలో జరిగిన పెన్షన్ ర్యాలీలో అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జిల్లా నేతలు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. భవిష్యత్తులో పెన్షన్ సాధన కోసం జరిగే కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యం తప్పకుండా పోషిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ సీపీఎస్ ఈయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ మాట్లాడుతూ టీఎస్ సీపీఎస్ ఈయూ చేపట్టిన పెన్షన్ కాన్స్టిట్యూషనల్ ర్యాలీ ఇంత విజయవంతంగా సాగడానికి ఏకైక కారణం, పాత పెన్షన్ పునరుద్ధరించాలనే బలమైన ఆకాంక్ష ఉద్యోగుల్లో ఉందని అన్నారు. పెన్షన్ పునరుద్ధరణ కోసం మరో తెలంగాణ ఉద్యమం నిర్మించడానికి నా ఉద్యోగులు వెనకాడరు అని చెప్పడానికి ఈ ర్యాలీనే నిదర్శనమని అన్నారు. సీపీఎస్ ఈయు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉండడం వల్లే అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ సాధించగలిగామని అన్నారు. అదే దిశలో తెలంగాణలోనూ అతి త్వరలోనే పాత పెన్షన్ విధానాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల కరుణాకర్ , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట విక్రమ్, రాష్ట్ర కార్యదర్శి పోతురెడ్డిపల్లి రామగోపి తో పాటు టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా సెక్రటరీ ఆర్ వీ ఎస్ సాగర్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నందగిరి శ్రీను , పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోత్కూరి మధు , యూటీఎఫ్ జిల్లా సెక్రటరీ పారుపల్లి నాగేశ్వరరావు,టీపీటీఎఫ్ జిల్లా సెక్రటరీ ఎస్. విజయ్,టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్,టీఆర్టీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రాముల్ నాయక్,తెలంగాణ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు పెడబోయిన నాగరాజు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బిక్కు,రూప్ టీఎస్ జిల్లా బాధ్యులు ఉమాదేవి,జెఎల్స్ ఫోరమ్ జిల్లా బాధ్యులు గణేష్, సీపీఎస్ జిల్లా సెక్రటరీలు యరమళ్ళ శ్రీనివాసరావు,బంగారయ్య,కోటాచారి,కాళిదాస్,లవన్ కుమార్,రవి చౌహాన్, షరీఫ్,భాను,యాకూబ్, సాయి ,సురేష్,రంగబాబు,వహీద్,ఆర్ వి ఆర్ ప్రసాద్,నరసింహారావు, వీరబాబు,జిలానీ, సమీరా,మల్లీశ్వరి,జకీర్,లక్ష్మణాచారి, శాకీరా,సాయి,మోహన్, సుభాన్,కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సమరోత్సాహంతో పెన్షన్ ర్యాలీ
RELATED ARTICLES
Recent Comments