ఫొటో గ్రాఫర్ల ప్లీనరీ సక్సెస్ చేయాలి
నర్సంపేట డివిజన్ ఫొటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘ ప్రధాకార్యదర్శి మండ కార్తీక్ గౌడ్
స్పాట్ వాయిస్, నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల పీఎస్ టీలు, శాశ్వత సభ్యులతో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నర్సంపేట డివిజన్ లోని ఫొటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నర్సంపేట డివిజన్ ఫఒటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మండ కార్తీక్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ దేశ ఫొటోగ్రఫీ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ఫొటోగ్రఫీ ప్లీనరీ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 8 గంటల వరకు శిల్పకళా వేదిక హైటెక్స్ మాదాపూర్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారన్నారు. సమావేశంలో ఫొటోగ్రాఫర్లందరూ వేలాదిగా తరలివచ్చి ఫొటోగ్రఫీ సంఘ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
ఫొటో గ్రాఫర్ల ప్లీనరీ సక్సెస్ చేయాలి
RELATED ARTICLES
Recent Comments