ముందు కేజ్రీవాల్.. తర్వాత కవిత
మళ్లీ లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్ర..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్స కవితను టార్గెట్ చేస్తూ లెటర్
బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రిలీజ్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్.. తన లాయర్ నుంచి ఈ లేఖలను విడుదల చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం రిలీజ్ చేసిన లేఖపై కవిత ఇచ్చిన కౌంటర్ కు ఆయన సమాధానం ఇచ్చారు. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడంపైనా స్పందించారు. ఈ మేరకు శనివారం మరిన్ని వివరాలు వెల్లడిస్తూ లేఖ రిలీజ్ చేశాడు.
లేఖలోని అంశాలు..
సుఖేష్ చంద్రశేఖర్ కవితతో తాను మాట్లాడిన ఫోన్ నెంబర్లు ఇవే అంటూ వాటిని బయటపెట్టారు. రెండు నంబర్లను లేఖలో రాశారు. ఈ నెంబర్ల నుంచే ఎమ్మెల్సీ కవితక్కతో మాట్లాడినట్లు స్పష్టం చేశాడు. ఈ నెంబర్ల నుంచే కవితకు వాట్సాప్ చాట్ చేసినట్లు వెల్లడించాడు.
* సుఖేష్‌కి తెలుగు ఎలా తెలుసని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని, నాకు తెలిసిన భాషలే కాకుండా.. నా మాతృభాష తెలుగు, తమిళం అని పేర్కొన్నారు. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో మా తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడేవారు… తెలుగు నా మాతృభాష అంటూ కౌంటర్ ఇచ్చారు.
* జైలు నుంచి సుఖేష్ లేఖలు ఎలా రాస్తున్నాడు.. ఫొటోలు, వీడియోలు ఎలా రిలీజ్ చేస్తున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారని ఈ విషయంలో నాకు స్పష్టమైన క్లారిటీ ఉందని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. కవిత, కేజ్రీవాల్ తో మాట్లాడిన, చాట్ చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ బయట ఉన్న తన టీం దగ్గర భద్రంగా ఉన్నాయని.. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కోరిన వెంటనే నా టీం.. ఆధారాలను సమర్పిస్తుందంటూ లేఖలో పేర్కొన్నాడు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బీ కింద తాను స్ర్కీన్ షాట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
మరికొన్ని స్క్రీన్ షాట్లు..
సుఖేష్ కవిత ఫోన్ నెంబర్లంటూ మరికొన్ని స్క్రీన్ షాట్లు విడుదల చేశాడు. కవిత పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్లు 6209999999, 8985699999 స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు. ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9810154102 అని లేఖలో పేర్కొన్నాడు ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారని కవిత, కేజ్రీవాల్ ను స్వాగతించాడు. ముందు ‘కేజ్రీవాల్’, ఆ తర్వాత నీవంతే అంటూ కవితకు సూచించాడు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్ విడుదల చేస్తానని సుకేష్ తాజా లేఖలో తెలిపాడు. ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులని వ్యాఖ్యానించాడు. తనను దొంగ, ఆర్థిక నేరగాడు అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములే అని పేర్కొన్నాడు. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు. దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానని సుకేష్ వ్యాఖ్యానించాడు. మొత్తం 703 ఛాట్లున్నాయనీ, అందులో ఇప్పటి వరకు కేవలం 2 ‘చాట్లు’ మాత్రమే బయటపెట్టానని పేర్కొన్నాడు. ఇంకా అనేక వీడియో చాట్లు, ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తానని పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ కవితను ఎల్లప్పుడూ నా అక్కగానే భావిస్తానంటూ పేర్కొన్నాడు.
Recent Comments