Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో నిందితులందరికీ బెయిల్..

టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో నిందితులందరికీ బెయిల్..

బండి సంజయ్ కస్టడీ ఫిటీషన్ కొట్టివేత
స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ లో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు డిస్మస్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీ ఈ పిటీషన్ పై కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ అవసరం లేదని.. ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయ్యిందంటూ బండి సంజయ్ తరపు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ కొట్టివేసింది. కేసులో కుట్ర కోణం లేదని.. కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని బండి సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ తోపాటు జైలుకు వెళ్లిన మరో ముగ్గురికి సైతం హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కండీషన్స్ కింద ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ఆర్డర్ కాపీ రాగానే.. ముగ్గురు నిందితులు కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ ఉన్నారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. బండి సంజయ్ తోపాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురిని కలుపుకుంటే.. మొత్తం నలుగురికి బెయిల్ మంజూరైంది. ఒకరు మైనర్ గా ఉన్నారు. ఆ బాలుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments