Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం..

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం..

మూడు వారాలు బెడ్ రెస్ట్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్‌ అయిందని, మూడు వారాలపాటు బెడ్‌రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు వెల్లడించారు. ఏదైనా సమాచారం లేదా సహకారం కోసం తన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందంటూ కవిత ట్వీట్ చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు, కవిత అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments