Thursday, April 17, 2025
Homeక్రైమ్పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి..

పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి..

పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి..

పెద్ద కూతురు మృతి..

చిన్న కూతురి పరిస్థితి విషమం

జనగామ జిల్లాలో దారుణం

స్పాట్ వాయిస్, జనగామ: తండ్రి.. పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు బిడ్డలకు విషo పెట్టాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం సాయంత్రం వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..

పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామానికి చెందిన గుండె శ్రీనుతో దద్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి కి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్ (4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను వీధిస్తూనే ఉన్నాడు. విసిగిపోయిన ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపాలనుకున్నాడు. ఈ నెల 6న కూల్ డ్రింక్ లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని పిల్లలు దాన్ని తాగారు.అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించగా చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments