మతసామరస్యానికి ప్రతీక రంజాన్
డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
స్పాట్ వాయిస్. హన్మకొండ రూరల్: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు.ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి హన్మకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లా దయతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. ఈ పవిత్ర మాసంలో మీరందరు పిలవగానే ఈ ఇఫ్తార్ విందుకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం ముస్లిం లకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ వాగ్దానాన్ని ఏమాత్రం పట్టించు కోవడం లేదన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి ముస్లిం సోదరులు అండగా ఉండాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ల కలను నెరవేస్తుందని అన్నారు.కొన్ని మతత్వ పార్టీలు కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని చూస్తునాయని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు..ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ రేపల్లె శ్రీనాథ్, స్టేట్ ఓబీసీ సెల్ కో-ఆర్డినేటర్ చందుపట్ల ధనరాజ్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, మాజీ పిఏసీఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గుర్రపు కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్, హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్, కంటెస్టు కార్పొరేటర్ మండల సమ్మయ్య, సందెల విజయ్, వస్కుల శంకర్, రాజారపు స్వామి, డివిజన్ ఓబీసీ సెల్ డిపార్ట్మెంట్ నేత బన్నీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Recent Comments