Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలులారీ అసోసియేషన్ల రచ్చ..

లారీ అసోసియేషన్ల రచ్చ..

చర్చలకు వెళ్లి.. కొట్టుకున్నారు..
పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు
భూపాలపల్లి, గణపురంలో ఉద్రిక్తత
స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు…, గణపురం లారీ అసోసియేషన్ సభ్యులు పర్సపరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. దెబ్బలుతిన్న గణపురం అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బస్వరాజు పల్లి కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీలో గణపురం లారీ అసోసియేషన్‌కు కాకుండా భూపాలపల్లి లారీలకు సింగరేణి యాజమాన్యం అనుమతి ఇవ్వగా.. తాము బుధవారం రాత్రి గణపురం లారీ అసోసియేషన్ కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీ వద్ద స్థానికేతర లారీలను అడ్డుకున్నామన్నారు. ఈ విషయమై గురువారం భూపాలపల్లి జీఎం ఆఫీసు వద్ద మాట్లాడుకుందాం రండి అంటూ గణపురం అసోసియేషన్ సభ్యులను భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించినట్లు చెప్పారు.

చర్చల అనంతరం తిరిగి వస్తుండగా.. . భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు వారి కార్యాలయం వద్ద అడ్డగించి.. మహేందర్, గండ్రతి సురేందర్, సతీష్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు చెప్పారు. అంతేకాకుండా సురేందర్, సతీష్ ను రూంలో బంధించగా.. వారు 100కు ఫోన్ చేశారని, దీంతో పోలీసులు వచ్చి కాపాడినట్లు చెప్పారు. ఈ ఘటన అనంతరం భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు కొంతమంది మళ్లీ లారీలో వచ్చి గణపురం అసోసియేషన్ సభ్యులపై దాడి చేస్తున్న క్రమంలో అన్నం జగ్గారావు తలకు గాయాలయ్యాయి. అలాగే క్షతగాత్రులమైన తమను పరామర్శించేందుకు వస్తున్న చలపతిరావుపై రామప్ప క్వా్ట్టర్స్ వద్ద మళ్లీ దాడికి దిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఇటు గణపురం అసోసియేషన్ సభ్యులు గణపురం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన పై ఫిర్యాదు చేస్తుండగా.. భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు భూపాలపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భూపాలపల్లి, గణపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments