24 గంటలు..
5,335 కోవిడ్ కేసులు..
అలర్ట్ అయిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ..
రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ
స్పాట్ వాయిస్, బ్యూరో: కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి. 24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం కూడా ఆందోళన కలిగిస్తుందని తన ప్రకటనలో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Recent Comments