Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలు8ఇంక్లైన్, ఓసీ 3 వద్ద ఉద్రిక్తత..

8ఇంక్లైన్, ఓసీ 3 వద్ద ఉద్రిక్తత..

8ఇంక్లైన్, ఓసీ 3 వద్ద ఉద్రిక్తత

– స్థానిక లారీలకు కాకుండా ప్రాంతీయేతర లారీలకు అనుమతి

– అడ్డుకున్న స్థానిక లారీ అసోసియేషన్

– ఎక్కడికక్కడ నిలిచిన లారీలు

పోలీసుల రంగ ప్రవేశం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బస్వరాజు పల్లి కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీలో బొగ్గు రవాణా నిలిచి పోయిoది. స్థానిక లారీ అసోసియేషన్ కు కాకుండా స్థానికేతర లారీలకు సింగరేణి యాజమాన్యం అనుమతి ఇవ్వడంతో బుధవారం రాత్రి గణపురం లారీ అసోసియేషన్ కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీ వద్ద స్థానికేతర లారీలను అడ్డుకున్నారు. దీంతో కేటీకే 8 ఇంక్లైన్, ఓసి త్రీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  ఈ నేపథ్యంలో గనుల  భారీగా లారీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు జీవనోపాధికి కోసం లారీలు కొనుగోలు చేసుకున్నామని, సింగరేణి అధికారులు తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments