Saturday, September 21, 2024
Homeరాజకీయంఖమ్మం జైలుకు బండి..

ఖమ్మం జైలుకు బండి..

14 రోజుల రిమాండ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం జైలుకి తరలించనున్నారు. కస్టడీ పిటిషన్ పై కోర్టులో ఇరువైపులా వాదనలు జరిగాయి. బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఏ1గా బండి సంజయ్..
టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments