Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కు బండి సంజయ్..!

వరంగల్ కు బండి సంజయ్..!

ప్రత్యేక కాన్వాయ్ లో తరలింపు..
కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు
వరంగల్ లో బండిపై కేసు ఫైల్..
జడ్జి ముందు హాజరుపర్చే చాన్స్
స్పాట్ వాయిస్, హైదరాబాద్:
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. భువనగిరి కోర్టులో హాజరుపరుస్తు్న్నామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్డెక్కిన తర్వాత పోలీస్ వాహనాల కాన్వాయ్ వరంగల్ వైపు మళ్లించారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఆయనపై వరంగల్ లో కేసు ఫైల్ అయ్యింది. పీఎస్ నుంచి కోర్టులో హాజరుపర్చటానికి తీసుకెళుతున్న సమయంలో.. కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. కారులోని వ్యక్తులు బయటకు కనిపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంజయ్‌ను తరలిస్తుండగా కారును బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే బీజేపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments