Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్టెన్త్ పేపర్ లీక్ నిందితుల అరెస్ట్

టెన్త్ పేపర్ లీక్ నిందితుల అరెస్ట్

టెన్త్ పేపర్ లీక్ నిందితుల అరెస్ట్

మైనర్ తో పాటు మరో ఇద్దరు..

స్పాట్ వాయిస్, క్రైమ్ : పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో మైనర్ తో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో బాలుడితో పాటు మౌటం శివ గణేష్ (18) కమలాపూర్ గ్రామం, బూరమ్ ప్రశాంత్ మాజీ విలేకరిని గుర్తించారు.

అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ నిందితుల్లో ఒకడైన మైనర్ ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహయం అందించడం కోసం పదవ తరగతి హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ ప్రక్కనే ఉన్న చెట్టు సహాయంతో ప్రహరీ గోడ ఎక్కి దాని పాఠశాల మొదటి అంతస్తులోని మూడవ సంబర్ల గదికి సంబంధించి ప్రహరీ గోడ పక్కనే వున్న కిటికి వద్ద పరీక్ష రాస్తున్న బాలుడి నుండి ఉదయం 9.45 నిమిషాలకు హిందీ పరీక్ష పత్రాన్ని తీసుకున్నాడు. దానిని తన సెల్ఫోన్ ఫోటోను తీసుకున్నాడు. అనంతరం నిందితుడు హిందీ ప్రశ్నపత్రం ఫోటో ను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్ కు పోస్ట్ చేయడం జరిగింది. అనంతరం రెండువ నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్ లో ఫార్వడ్ చేశాడు., మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ క్కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుంచి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేశాడు. దీనితో హిందీ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టడంతో విద్యా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించారు. నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, ఏసిపి తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్, రాజు, ఆంజనేయులు లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments