Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్రెండో రోజూ టెన్త్ పేపర్ లీక్..

రెండో రోజూ టెన్త్ పేపర్ లీక్..

వాట్సప్ లో చక్కర్లు కొట్టిన హిందీ పేపర్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. సోమవారం వికారాబాద్‌లో పదోతరగతి తెలుగు పేపర్ బయటకొచ్చిన ఘటన మరవకముందే మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చినట్లుగా వాట్సప్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉదయం 9.30కే పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ లో హిందీ పేపర్ చక్కర్లు కొడుతోంది. హిందీ పేపర్ లీక్ అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే హిందీ పేపర్ లీక్ పై వరంగల్ జిల్లా డీఈవో వాసంతి స్పందించారు. ఇవన్ని వదంతులేనని అన్నారు. దీనిపై సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments