వదలని వాన
ఓరుగల్లుకు ఎల్లో అలర్ట్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం తేలిక పాటి నుంచి భారీ వర్షం , రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి పొడి వాతావారణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.
Recent Comments