స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది. 2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో ఓ వ్యక్తి కేసు వేశారు. రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే గురువారం.. సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో సూరత్ కోర్టు బెయిల్ సైతం మంజూరు చేసింది
Recent Comments